ఆంధ్ర ప్రదేశ్
విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో పర్యటించిన మంత్రులు

విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో మంత్రులు సత్యకుమార్, నారాయణ పర్యటించారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్‌లో రోగుల ఆరోగ్య పరిస్థితిని మంత్రులు అడిగి తెలుసుకున్నారు. డయేరియాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పడుతున్నాయని అన్నారు.
ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య సర్వే చేస్తున్నామన్నారు. నీటి శాంపిల్స్ సేకరిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 141 కేసులు నమోదయ్యాయని ప్రస్తుతం 61 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు. డయేరియాపై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు.



