ఆంధ్ర ప్రదేశ్
నేపాల్ నుంచి ఆంధ్రప్రదేశ్ చేరుకున్న ఏపీ వాసులు

నేపాల్ నుంచి ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు ఏపీ వాసులు. ప్రత్యేక విమానంలో 144 మంది వచ్చారు. విశాఖ ఎయిర్‌పోర్టులో 104 మంది.. రేణిగుంట ఎయిర్‌పోర్టులో 40 మంది దిగారు. ఖాట్మండు ఎయిర్పోర్ట్ నుంచి బాధితుల్ని సురక్షితంగా తరలించారు.
వారిని బస్సుల్లో స్వస్థలాలకు పంపారు అధికారులు. ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించారు. నేపాల్ నుంచి సేఫ్‌గా రప్పించేందుకు కృషి చేసిన మంత్రి లోకేష్‌కు బాధితులు ధన్యవాదాలు తెలిపారు.



