సినిమా
Janhvi Kapoor: పెళ్లి, పిల్లలపై జాన్వీ షాకింగ్ రివీల్!

Janhvi Kapoor: బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలతో సోషల్ మీడియాను షేక్ చేసింది. పెళ్లి, పిల్లల గురించి ఆమె చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. తిరుపతిలో సెటిల్ కావాలని ఆమె కోరిక అట. ఇంతకీ ఆమె ఏం చెప్పింది. పూర్తి వివరాలు చూద్దాం.
జాన్వీ కపూర్ తన తాజా చిత్రం ‘పరమ్ సుందరి’ ప్రమోషన్స్‌లో భాగంగా కపిల్ శర్మ షోలో సందడి చేసింది. అక్కడ ఆమె మూడు తన లక్కీ నంబర్ కాబట్టి ముగ్గురు పిల్లలు కావాలని సరదాగా చెప్పింది. ఇద్దరు పిల్లలైతే గొడవలు ఎక్కువని, ముగ్గురైతే ఇల్లు సందడిగా ఉంటుందని ఆమె ఫన్నీ కామెంట్ చేసింది.
తిరుమలలో పెళ్లి చేసుకుని తిరుపతిలో సెటిల్ కావాలని జాన్వీ కలలు కన్నది. ఈ వ్యాఖ్యలు నెటిజన్లను ఆకర్షించాయి. జాన్వీ సౌత్ ఇండియన్ మూలాలు, ఆమె సరదా స్వభావం అభిమానులను మరింత ఆకట్టుకున్నాయి. ఆమె తదుపరి ప్రాజెక్టులపై ఆసక్తి నెలకొంది.



