తెలంగాణ
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

Telangana Assembly: తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలిని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు.
సమావేశాలు మొదలైన వెంటనే, ఇటీవల మరణించిన సభ్యుల కోసం సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల సభ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి నివాళులర్పించారు. అలాగే, శాసనమండలిలోనూ మాజీ ఎమ్మెల్సీలు డాక్టర్ టి. రత్నాకర్, ఎం. రంగారెడ్డి మరణం పట్ల సంతాపం తెలిపారు.



