సినిమా

దివ్యాంగ చిన్నారికి చిరు సాయం!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మానవత్వం మరోసారి బయటపడింది. జీ తెలుగు ‘సూపర్ సింగర్ లిటిల్ ఛాంప్స్’లో పాల్గొంటున్న దివ్యాంగ చిన్నారి వరుణవిని కలిసిన వీడియో వైరల్ అవుతోంది. ఆమెను ఒడిలో కూర్చోబెట్టుకుని మాట్లాడిన మూమెంట్ ఎమోషనల్‌గా మారింది. చిన్నారి భవిష్యత్తుకి చిరు హామీ ఇవ్వడం గమనార్హం. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.

జీ తెలుగు ఛానల్‌లో ప్రసారమవుతున్న ‘సూపర్ సింగర్ లిటిల్ ఛాంప్స్’లో వరుణవి అనే దివ్యాంగ చిన్నారి హైలైట్‌గా నిలుస్తోంది. పుట్టుకతోనే కళ్లు కనిపించని ఆమె మధుర గొంతుతో అందరినీ ఆకర్షిస్తోంది. గతంలో జడ్జి అనిల్ రావిపూడిని చిరంజీవితో కలిసే అవకాశం కోరుతూ వచ్చింది. దాంతో అనిల్ రావిపూడి అపాయింట్‌మెంట్ ఏర్పాటు చేశారు.

తాజాగా చిరంజీవి వరుణవిని కలిసి ఒడిలో కూర్చోబెట్టుకుని మాట్లాడారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నారికి ఏ అవసరమైనా తాను అండగా ఉంటానని, కుటుంబానికి అభయమిస్తానని చిరంజీవి హామీ ఇచ్చారు. ఆ మాటలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చిరంజీవి మానవత్వం మరోసారి హృదయాలను తాకింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button