Medak: భారీ వర్షాలు.. నీట మునిగిన ఏడుపాయల ఆలయం

మెదక్ జిల్లాను అతి భారీ వర్షం కుదిపేసింది. అల్పపీడ ప్రభావంతో రెండు రోజుల పాటు కురిసిన ఎకధాటిగా వర్షాలు వాగులు, వంకలు, రోడ్లు, పొలాలను ఏకం చేశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వరదలు పోటెత్తాయి. వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. రోడ్లు దెబ్బతిని రాకపోకలకు ఆటంకం కలిగింది. జనజీవనం స్తంభించింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం కొన్ని రోజులుగా గంగమ్మ ఓడిలోనే ఉంది.
రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. సింగూర్ నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో ఆలయం పూర్తిగా నీటమునిగింది. నక్క వాగుతో పాటు వనదుర్గ ఆనకట్ట మీదుగా వరద నీరు ఏడుపాయలుగా చీలి ప్రవహిస్తోంది. వనదుర్గ ఆనకట్ట,గర్భ గుడి వైపు ఎవరు వెళ్లకుండా బ్యారీ కేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు పహార కాస్తున్నారు.వరద ఉదృతి తగ్గగానే యధావిధిగా అమ్మవారి దర్శనం కల్పిస్తామని అధికారులు తెలిపారు.



