సినిమా

మహావతార్ నరసింహా: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన యానిమేటెడ్ సంచలనం!

Mahavatar Narasimha: చిన్న బడ్జెట్‌తో వచ్చిన ‘మహావతార్ నరసింహా’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. భారీ చిత్రాలను ఢీకొట్టి, రూ.300 కోట్ల కలెక్షన్స్ సాధించిన ఈ యానిమేటెడ్ సినిమా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ విజయ రహస్యమేంటో చూద్దాం..

జులై 25న విడుదలైన ‘మహావతార్ నరసింహా’యానిమేటెడ్ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రూ.25 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. హరిహర వీరమల్లు, వార్ 2, కూలీ వంటి భారీ చిత్రాలతో పోటీపడి విజేతగా నిలిచింది.

హిందీలో రూ.50 కోట్ల గ్రాస్ దాటిన ఈ చిత్రం తెలుగులోనూ అద్భుత వసూళ్లు రాబట్టింది. భక్తి ఎలిమెంట్స్, యానిమేషన్ క్వాలిటీ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఐదో వారంలోనూ థియేటర్లలో ఈ సినిమా ఆకర్షిస్తోంది. భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ చిత్రంగా రికార్డు సృష్టించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button