సినిమా
War 2: వార్ 2 హిందీ కలెక్షన్స్ సంచలనం!

War 2: హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘వార్ 2’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. హిందీలో నాలుగో రోజు భారీ కలెక్షన్స్ సాధించిన ఈ స్పై థ్రిల్లర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ‘వార్ 2’ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. హిందీలో నాలుగో రోజు రూ. 25 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం, నాలుగు రోజుల్లో మొత్తం రూ. 123 కోట్ల నెట్ రాబట్టింది.
ఆగస్టు 15 నుంచి హిందీలో 55 శాతం జంప్ నమోదైంది. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో రూపొందిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద బలమైన ప్రదర్శన కొనసాగిస్తోంది. సోమవారం నుంచి కలెక్షన్స్ ఈ సినిమా రేంజ్‌ను నిర్ణయిస్తాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



