తెలంగాణ
భూపాలపల్లిలో బస్టాండ్ దగ్గర ఆటోపై కూలిన చెట్టు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆటోపై వేపచెట్టు కూలడంతో ఆటో డ్రైవర్ తీవ్ర గాయాలయ్యాయి. బస్సుల కోసం ప్రతిరోజు ప్రయాణికులు వేచిచూసే ప్రాంతంలో ఉన్న పెద్ద వేపచెట్టు రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఆటోపై కూలింది. స్థానికులు డ్రైవర్‌ను ఆటో నుంచి బయటికి తీశారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక్కసారిగా చెట్టు కూలడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.



