ఆంధ్ర ప్రదేశ్
Balakrishna: పులివెందులలో టీడీపీ గెలుపు ప్రజాస్వామ్య విజయం

Balakrishna: పులివెందులలో టీడీపీ గెలుపు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పష్టం చేశారు. పులివెందులలో టీడీపీ గుండాగిరి చేసి గెలిచిందన్న వైసీపీ ఆరోపణలను టీడీపీ నేత ఖండించారు. డబుల్ ఇంజిన్ సర్కార్, కూటమి నేతలు రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని బాలకృష్ణ అన్నారు.
చిలమత్తూరు మండలం టేకులోడు గురుకుల బాలికల పాఠశాలలో 8 కోట్ల 60లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్, విద్యార్థినుల వసతి గృహాలను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు.



