ఆంధ్ర ప్రదేశ్
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. పశ్చిమ వాయవ్యంగా పయనించి తీవ్ర అల్పపీడనంగా బలపడుతుంది. రేపటికి నాటికి వాయుగుండంగా బలపడుతుందని కొన్ని వాతావరణ మోడల్స్ అంచనా వేశాయి. అల్పపీడనం ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు, అక్కడక్కడా భారీవర్షాలు కురిశాయి. ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడనున్నాయి.
కొన్నిచోట్ల అసాధారణ వర్షాలు, పశ్చిమగోదావరి, ఏల్లూరు, నెల్లూరు, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, తూర్పుగోదావరి, తిరుపతి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. కుంభవృష్టిగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో వరదలు రావొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.



