Coolie: కూలీ సర్ప్రైజ్ ట్విస్ట్!

Coolie: సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌తో లింక్ ఉందా? రైటర్ చేసిన తాజా స్టేట్‌మెంట్ సినీ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. థియేటర్లలో సర్ప్రైజ్ వేచి ఉందట!
రజినీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్ కలయికలో లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ‘కూలీ’ సినిమా హైప్‌ను రెట్టింపు చేసింది. ఈ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌తో లింక్ లేదని దర్శకుడు చెప్పినప్పటికీ, అభిమానులు దీన్ని ఎల్‌సియూతో జోడిస్తున్నారు.
ఈ సినిమాకు కో-రైటర్‌గా పనిచేసిన చంద్రు అన్బళగన్ ఇచ్చిన స్టేట్‌మెంట్ వైరల్ అవుతోంది. సినిమాలో ఖచ్చితంగా సర్ప్రైజ్ ఉందని, అది ఎల్‌సియూతో లింకా లేక వేరే ట్విస్టా అనేది థియేటర్లలోనే తెలుస్తుందని ఆయన అన్నారు. ఈ స్టేట్‌మెంట్ అభిమానుల ఆసక్తిని మరింత పెంచింది. రిలీజ్ తర్వాత ఈ సర్ప్రైజ్ ఏంటో చూడాలి.



