ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష

Chandrababu: అమరావతి రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. రాజధాని నిర్మాణం కోసం మొత్తం 81వేల317 కోట్ల మేర పనులను సీఆర్డీఏ ప్రతిపాదించింది.
ప్రస్తుతం 50వేల 552 కోట్ల విలువైన పనులకు సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. రాజధానిలో 74 ప్రాజెక్టుల పనులు ప్రారంభమైనట్టు సీఎంకు అధికారులు వివరించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.



