సినిమా
Avinash Reddy: టీడీపీ అనేక అక్రమాలకు పాల్పడుతోంది

Avinash Reddy: పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల్లో టీడీపీ అనేక అక్రమాలకు పాల్పడుతోందని ఎంపీ అవినాష్ రెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో ఓటర్లను ఇబ్బందిపెట్టేందుకు పోలింగ్ బూతులను వాళ్ళకు ఇష్టానుసారంగా మార్చారని ధ్వజమెత్తారు. ఒక్కో గ్రామానికి చెందిన ఓటర్లు దాదాపు ఐదు కిలోమీటర్లు వెళ్లి ఓటేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.
ఎన్నికల కమీషన్ ఇచ్చిన ఓటర్ స్లిప్పులను సైతం టీడీపీకి చెందిన నేతలు గ్రామాలకు వెళ్లి డబ్బులిచ్చి తిరిగి అవే ఓటరు స్లిప్పులను కలెక్ట్ చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారులతో పాటు ఎస్ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.



