ఆంధ్ర ప్రదేశ్
Suneetha Narreddy: శిక్ష నిందితులకా..నాకా అర్ధం కావట్లేదు

Suneetha Narreddy: కడప జిల్లా పులివెందులలో వివేకా ఘాట్ వద్ద వైఎస్ సునీత దంపతులు నివాళులు ఆర్పించారు. వివేకా హత్య కేసులో నిందితులంతా యథేచ్ఛగా బయటే తిరుగుతున్నారని వైఎస్ సునీత విమర్శించారు. వాయిదాలకు నిందితులతో పాటు నేనూ కోర్టుకు హాజరవుతున్నానని అన్నారు. శిక్ష నిందితులకా నాకా అర్ధం కావట్లేదని వైఎస్ సునీత అన్నారు.
ఇంకా ఎన్నేళ్లు న్యాయ పోరాటం చేయాలో అర్ధం కావట్లేదన్నారు. దర్యాప్తు పూర్తయిందని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపిందన్నారు. దర్యాప్తు అసంపూర్తిగా ఉందని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామన్నారు. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని అన్నారు.



