తెలంగాణ
Heavy Rains: హైదరాబాద్లో దంచికొట్టిన వాన.. చెరువులుగా మారిన రోడ్లు

హైదరాబాద్ మహానగరంలో రాత్రి వాన దంచికొట్టింది. నగరమంతా కుండపోత వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. భారీ వర్షానికి భాగ్యనగరం తడిసిముద్దైంది. జూబ్లీహిల్స్, కృష్ణానగర్, యూసుఫ్ గూడ, ఎల్లారెడ్డి గూడ ప్రాంతాలతో పాటు మధురానగర్, శ్రీనివాస్ నగర్ వెస్ట్ నుంచి భారీగా వరద రావడంతో రోడ్డుపై నీళ్లు నిలిచిపోయాయి.
వర్షం ధాటికి పలు బస్తీలు, కాలనీలు, రహదారులపై భారీగా వర్షం నీరు నిలిచిపోవడంతో చెరువులను తలపించాయి. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. వర్షాల కారణంగా పలు చోట్ల విద్యుత్ సరఫరా సైతం నిలిచిపోయాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి.



