ఆంధ్ర ప్రదేశ్

రాహుల్ గాంధీపై కాంగ్రెస్ నేత రఘువరన్ రెడ్డి ప్రశంసలు

శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్‌గాంధీపై CWC మెంబర్ రఘువరన్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. రెండు రోజులుగా దేశంలో రెండు సదస్సుల్లో ఓబీసీలపై రాహుల్ గాంధీ ప్రసంగం అద్భుతంగా ఉందన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధిపై రాహుల్ గాంధీకి స్పష్టత ఉందన్నారు.

కాంగ్రెస్ హయాంలో రిజర్వేషన్లతో పేదవారికి హక్కులు కల్పించామన్నారు. ఆర్థికంగా సామాజికంగా ఇంకా ఎంతవరకు పేదలకు న్యాయం జరగాలనే అంశంపై రాహుల్ గాంధీ అధ్యయనం చేశారన్నారు. ఇంకా ఏంచేయాలి అందరినీ సమానంగా చూస్తూ అటు అగ్రవర్ణాలతో పాటు ఓబీసీలకు ఎంతవరకు న్యాయం జరగాలనే అంశంపై రాహుల్ గాంధీ అవగాహనలో ఉన్నారన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button