త్రిష-విజయ్ రిలేషన్‌పై మళ్లీ రూమర్స్!

Trisha- Vijay: సీనియర్ హీరోయిన్ త్రిష, స్టార్ హీరో విజయ్‌ల మధ్య రిలేషన్‌పై మరోసారి పుకార్లు షికారు చేస్తున్నాయి. విజయ్ బర్త్‌డే సందర్భంగా త్రిష చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌లో వీరి కెమిస్ట్రీ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తున్న సీనియర్ హీరోయిన్ త్రిష గురించి కొత్త గాసిప్‌లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. 42 ఏళ్ల వయసులోనూ సింగిల్‌గా ఉన్న త్రిష, స్టార్ హీరో విజయ్‌తో రిలేషన్లో ఉందనే రూమర్స్ గతంలోనూ వచ్చాయి.
తాజాగా, విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష షేర్ చేసిన ఓ ఫోటో మరోసారి ఈ ఊహాగానాలకు ఆజ్యం పోసింది. ఈ ఫోటోలో విజయ్, త్రిష పెంచుకునే కుక్క ఇజ్జీతో ఆడుకుంటూ కనిపించగా, త్రిష అతడి పక్కన నవ్వుతూ ఉంది. ఈ కోజీ మూమెంట్ చూసిన నెటిజన్లు వీరి బంధం గురించి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరూ గతంలో ‘గిల్లీ’, ‘లియో’ వంటి సినిమాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ రిలేషన్ రూమర్స్‌పై త్రిష, విజయ్ నుంచి ఇంతవరకు క్లారిటీ రాలేదు.