అల్లు అర్జున్ సినిమాల టైటిల్స్ పై క్రేజీ రూమర్?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల్లో కొత్త హంగామా! ‘శక్తిమాన్’ టైటిల్‌తో రెండు భారీ ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
అల్లు అర్జున్ అభిమానులకు డబుల్ సర్ప్రైజ్! తమిళ దర్శకుడు అట్లీతో బన్నీ ఓ సూపర్ హీరో చిత్రంలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు ‘శక్తిమాన్’ టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనె హీరోయిన్గా కనిపించనుంది. అల్లు అర్జున్ యాక్షన్, పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో అద్భుతంగా ఉంటాయని బజ్.
అయితే, ట్విస్ట్ ఏంటంటే మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ కూడా అదే ‘శక్తిమాన్’ టైటిల్‌తో బన్నీతో సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఒకే టైటిల్‌తో రెండు సినిమాలు రావడంతో సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ టైటిల్ రేసులో ఏ ప్రాజెక్ట్ ముందుకెళ్తుందో తెలియాలంటే కొంత సమయం వేచి ఉండాల్సిందే.