అంతర్జాతీయం
ట్రంప్‌తో వివాదం… మస్క్‌కు రష్యా బంపర్ ఆఫర్..!

మరోవైపు మస్క్‌కు రష్యా బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు టాక్ వినబడుతోంది. ట్రంప్‌తో వివాదం నేపథ్యంలో మస్క్‌కు బొనంజా ఇచ్చింది. తమ దేశంలో రాజకీయ శరణార్థిగా ఆశ్రయం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామంటోంది రష్యా. అయితే తాను బాగా బిజీ అని, మస్క్ అయితే బాగుండాలన్నారు ట్రంప్. మస్క్ గురించి తాను ఏమీ ఆలోచించడం లేదన్నారు ట్రంప్.
చైనా, రష్యా సహా ఇతర విషయాలతో బిజీగా ఉన్నట్లు చెప్పారు ట్రంప్. ఈ నేపథ్యంలో ట్రంప్‌తో విభేదాలు మస్క్ కొత్త పార్టీ పేరు ఇదేనా? అంటూ అమెరికాలో కొత్త పార్టీ పెట్టాల్సిన ఆవశ్యకత ఉందా? అంటూ ప్రశ్నించారు. ఎక్స్‌లో పోల్ పెట్టిన ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్ 80 శాతం మంది అనుకూలంగా ఓటు వేశారని చెప్పారు. అమెరికా పార్టీ అంటూ ఎక్స్‌లో పేరు వెల్లడిస్తూ పోస్టు చేశారు మస్క్.