సినిమా
నేడు మరోసారి నిర్మాతల సమావేశం

ఇవాళ మరోసారి సినీ నిర్మాతలు సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్లపై చర్చించనున్నారు. ఇప్పటికే థియేటర్ల బంద్ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని నిర్మాతలు కోరారు. అయితే ఇప్పుడొస్తున్న సినిమాలకు మొదటి వారమే కలెక్షన్స్ ఉంటున్నాయని.., రెండోవారం కలెక్షన్స్ ఉండటం లేదని ఎగ్జిబిటర్స్ వాపోతున్నారు.
అంతేకాదు మొదటి వారం వచ్చే కలెక్షన్స్‌లో రెంట్ విధానం కాకుండా షేర్ ఇవ్వాలని ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జూన్ 1న థియేటర్ల బంద్‌పై ఉత్కంఠ కొన సాగుతోంది. ఇక ఇవాళ్టి సమావేశంలో చర్చలకు పరిష్కారం లభించే అవకాశం ఉండనుంది.