Imanvi: ఇమాన్వి స్ట్రాంగ్ రిప్లై.. పాక్ మిలిటరీ వార్తలపై క్లారిటీ

Imanvi: సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురైన యంగ్ యాక్టర్ ఇమాన్వి తాజాగా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. తన తండ్రి మాజీ పాకిస్థానీ మిలిటరీ అధికారి అని, ఆమె ఇండియన్ సినిమాల్లో నటించకూడదని వస్తున్న వార్తలపై స్పష్టత ఇచ్చారు. ఈ వివాదంపై ఇమాన్వి ఏమన్నారు? వివరాల్లోకి వెళదాం.
ఇమాన్వి సోషల్ మీడియాలో ఆమెపై వస్తున్న ట్రోలింగ్ వార్తలు వైరల్ అయ్యాయి. ఆమె తండ్రి పాకిస్థానీ మాజీ మిలిటరీ అధికారి అని, ఆమెకు పాకిస్థాన్‌తో సంబంధం ఉందని పలువురు ఆరోపించారు. ఈ వార్తలపై ఇమాన్వి స్పష్టమైన సమాధానం ఇచ్చారు.
తాను పాకిస్థానీ కాదని, తన తల్లిదండ్రులు ఇండో-అమెరికన్స్ అని తెలిపారు. లాస్ ఏంజిల్స్‌లో పుట్టిన తాను గుజరాతీ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలు మాట్లాడగలనని చెప్పారు. చదువు పూర్తయ్యాక ఆర్ట్స్ నేర్చుకున్న ఆమె, ఇండియన్ సినిమాల్లో నటించడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాలు చేయవద్దని కోరిన ఇమాన్వి, ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు.