సినిమా

Lokesh Kanagaraj: హీరోగా మారుతున్న లోకేశ్ కనగరాజ్

Lokesh Kanagaraj: తమిళ సినిమా పరిశ్రమలో స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న లోకేశ్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా మారేందుకు సిద్ధమవుతున్నాడా? కోలీవుడ్‌లో ఈ వార్త సంచలనం రేపుతోంది. లోకేశ్ తన స్వీయ దర్శకత్వంలో హీరోగా ఓ సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.

లోకేశ్ కనగరాజ్ తన దర్శకత్వ ప్రతిభతో ‘కైది’, ‘విక్రమ్’, ‘లియో’ లాంటి బ్లాక్‌బస్టర్స్‌తో కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. అయితే, ఇప్పుడు ఆయన నటనపై మక్కువ చూపిస్తూ హీరోగా మారేందుకు రెడీ అవుతున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తన సొంత దర్శకత్వంలో ఓ సినిమాలో లీడ్ రోల్‌లో నటించనున్నట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని, ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరందుకున్నట్లు సమాచారం. గతంలో శృతి హాసన్‌తో ‘ఇనిమేల్’ అనే మ్యూజికల్ ప్రాజెక్ట్‌లో నటించిన లోకేశ్, ఇప్పుడు పూర్తి స్థాయి హీరోగా అవతారం ఎత్తితే ఎలాంటి సంచలనం సృష్టిస్తాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వార్తలపై లోకేశ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button