NBK 111: బాలయ్య డ్యూయల్ లుక్ అదుర్స్!

NBK 111: నందమూరి బాలకృష్ణ కెరీర్లో 111వ చిత్రం నేడు భారీ ముహూర్తంతో ప్రారంభమైంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పోస్టర్లో బాలయ్య రెండు శక్తివంతమైన వారియర్ లుక్స్‌లో కనిపిస్తూ అభిమానుల్ని ఆకట్టుకున్నాడు.
నటసింహం నందమూరి బాలకృష్ణ 111వ చిత్రం నేడు ఘనంగా ప్రారంభమైంది. ‘వీర సింహా రెడ్డి’ ఫేమ్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు వృద్ధి సినిమాస్ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం అనౌన్స్మెంట్ నుంచే బలమైన బజ్ సొంతం చేసుకుంది.
ముహూర్తం సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో బాలయ్య డ్యూయల్ రోల్లో కనిపిస్తూ రెండు భిన్నమైన యోధుల రూపాల్లో దర్శనమిచ్చాడు. ఒక లుక్ పూర్తి యుద్ధ వస్త్రధారిగా ఉంటే మరొకటి షర్ట్ లేకుండా రుద్రాక్ష మాలలతో రుద్రుని రూపంలో ఉంది. ఇద్దరి నడుమ రెండు భిన్న కోటలు కూడా ఉండటం ప్రత్యేక ప్రపంచం సృష్టించినట్టు స్పష్టం చేస్తోంది.



