తెలంగాణ
Jagga Reddy: గాంధీ కుటుంబంపై బీజేపీ నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు

Jagga Reddy: బీజేపీ నాయకులపై TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైరయ్యారు. గాంధీ కుటుంబంపై బీజేపీ నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణ త్యాగాలు చేశారని అన్నారు.
త్యాగాల చరిత్ర లేని బీజేపీ గాంధీ కుటుంబంపై బురద జల్లడం బాధాకరమని అన్నారు. ప్రధాని పదవిని సైతం సోనియా గాంధీ వద్దని మన్మోహన్ సింగ్ ను ప్రధాని చేశారని ఆయన గుర్తు చేశారు. పదవులు వద్దనుకునే గుణం బీజేపీ నాయకుల్లో ఒక్కరికైన ఆ సత్తా ఉందా అని ఛాలెంజ్ చేశారు.



