సినిమా
‘తమ్ముడు’ ఫస్ట్ సింగిల్‌తో సందడి స్టార్ట్!

Thammudu: నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్లో ‘తమ్ముడు’ సినిమా రేపు ఫస్ట్ సింగిల్ రిలీజ్‌తో యూత్‌లో జోష్ నింపనుంది.
యూత్ స్టార్ నితిన్ హీరోగా, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కథానాయికలుగా ‘తమ్ముడు’ చిత్రం హడావిడి సృష్టిస్తోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ యాక్షన్, ఫన్ మిక్స్‌తో అభిమానుల్లో ఉత్సాహం నింపింది.
సాధారణంగా సినిమాలకు ముందు పాటలు, టీజర్ వస్తాయి కానీ, ఈ చిత్రం ట్రైలర్ తర్వాత మొదటి సింగిల్ ని రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తోంది. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా, దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు. జూలై 4న థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ సినిమా యూత్‌ను ఆకర్షించే విధంగా ఉంటుందని అంచనా. ‘తమ్ముడు’ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.