తెలంగాణ
హైదరాబాద్ చింతల్‌లో పోలీసుల బతుకమ్మ వేడుకలు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్ డివిజన్ పోలీసులు వైభవంగా నిర్వహించారు. చింతల్‌లోని ఎంపీఆర్ ఫంక్షన్ హాల్‌లో బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు. బతుకమ్మల పోటీలో రంగురంగుల పూలతో అద్భుతంగా అట్ల బతుకమ్మను పేర్చిన బాలానగర్ మహిళా పోలీసులు ప్రథమ బహుమతి దక్కించుకున్నారు. పండుగలు మన సంస్కృతికి అద్దం పడతాయని ఏసీపీ నరేష్ రెడ్డి తెలిపారు. నేటి సంబరాలు తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను సజీవంగా ఉంచుతున్నాయన్నారు.



