తెలంగాణ
హైదరాబాద్‌లో మరోసారి దంచికొట్టిన వర్షం

హైదరాబాద్‌లో మరోసారి వర్షం దంచికొట్టింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. పలు కాలనీలు నీట మునిగాయి. జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. వర్షాలపై మంత్రి పొన్నం సమీక్ష జరిపారు. నిన్న అమీర్‌పేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.



