అంతర్జాతీయం
Donald Trump: గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నాం

Donald Trump: ఇజ్రాయెల్-గాజా మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. తాము గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు ట్రంప్‌తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇజ్రాయెల్, గాజా యుద్ధం తాజా పరిస్థితిపై చర్చించారు. అనంతరం గాజాను తాము స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్లు ట్రంప్ అధికారికంగా ప్రకటించారు.
అలాగే.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గురించి కూడా ట్రంప్ ప్రస్తావించారు. జిన్‌పింగ్‌తో తాను ఫోన్లో మాట్లాడానికి తొందరేమీ లేదని ప్రస్తావించారు. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం నేప థ్యంలో.. ఇరువురు చర్చిస్తారని వస్తున్న వార్తల నేపథ్యంలో ట్రంప్ స్పందించారు. ప్రస్తుతం ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.