Rajagopal Reddy: సీఎం రేవంత్ రెడ్డి భాష మార్చుకుంటే మంచిది

Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవి కావాలనుకుంటే తనకు కేసీఆరే ఇచ్చేవాడని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ హామీ ఇచ్చినందునే ప్రస్తుతం మంత్రి పదవి గురించి ప్రస్తావిస్తున్నట్లు కోమటిరెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విపక్షాలపై విమర్శలు గుప్పించేటప్పుడు వాడుతున్న భాష మార్చుకోవాలని రాజగోపాల్ హితవు పలికారు.
సోషల్ మీడియా విషయంలో రేవంత్ రెడ్డి తీరు ఓడ మల్లన్న బోడ మల్లన్న అన్నట్లు ఉందని విమర్శించారు రాజగోపాల్. సీఎం రేవంత్ రెడ్డిపై వివిధ సందర్భాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న విమర్శలు, ఆరోపణలు స్వపక్ష కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి. తాను ఎవరి మోచేతి నీళ్లు తాగనని మునుగోడు ప్రజల కోసం అవసరమైతే మళ్లీ రాజీనామాకు సిద్ధమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడటం హస్తం పార్టీలో చర్చకు తెరలేపింది.



