ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల శ్రీవారికి రూ.3.86 కోట్ల విలువైన స్వర్ణ యజ్ఞోపవీతం

Tirumala: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడికి 3కోట్ల 86 లక్షల రూపాయల విలువైన భారీ బంగారు కానుక అందింది. వైజాగ్‌కు చెందిన హిందుస్థాన్ ఎంటర్‌ప్రైజ్ ఎండి పువ్వాడ మస్తాన్ రావు- కుంకుమ రేఖ దంపతులు తిరుమల శ్రీవారికి కానుకలు సమర్పించుకున్నారు.
వజ్రాలు పొదిగిన స్వర్ణ యజ్ఞోపవీతాన్ని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు దాతలు అందజేశారు. శ్రీవారికి కానుకలు సమర్పించిన మస్తాన్‌రావు దంపతులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తీర్థప్రసాదాలు సమర్పించి సత్కరించారు.



