Shilpa Shetty: శిల్పా శెట్టి ఇంటిపై ఐటీ దాడులు?

Shilpa Shetty: శిల్పా శెట్టి-రాజ్ కుంద్రా దంపతుల ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. బాస్టియన్ రెస్టారెంట్‌కు సంబంధించిన కేసులో ఈ తనిఖీలు జరిగాయి. ఇది సాధారణ తనిఖీలేనని వారి లాయర్ స్పష్టం చేశారు. ఈ విషయంపై పూర్తి వివరాలు చూద్దాం.
శిల్పా శెట్టి-రాజ్ కుంద్రా దంపతులు ఇటీవల ఆర్థిక మోసం, ఈడీ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వారి ఇంటిపై ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. బాస్టియన్ రెస్టారెంట్‌కు సంబంధించిన కేసులో ఈ తనిఖీలు జరిగాయని వార్తలు వచ్చాయి. అయితే ఇవి సాధారణ తనిఖీలు మాత్రమేనని శిల్పా శెట్టి లాయర్ స్పష్టం చేశారు.
రెస్టారెంట్‌ను అనధికారికంగా నిర్వహిస్తున్నారని బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈ సోదాలు జరిగాయి. మరోవైపు దీపక్ కొఠారి అనే వ్యాపారి దాఖలు చేసిన 60 కోట్ల మోసం కేసు కూడా కోర్టులో విచారణలో ఉంది. రాజ్ కుంద్రా తండ్రి అనారోగ్యం కారణంగా విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించగా లుకౌట్ నోటీసు ఉండటంతో వెళ్లలేకపోయారు. దేశం వదిలి వెళ్లాలంటే 60 కోట్ల బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.



