News
రాజమౌళి వ్యాఖ్యలపై వీహెచ్‌పీ నేత రావినూతల శశిధర్ ఫైర్

Ravinuthala Shashidhar: రాజమౌళి వ్యాఖ్యలపై వీహెచ్‌పీ నేత రావినూతల శశిధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమౌళి అహంకారంతో హిందూ మత విశ్వాసాలను కించపరించేలా మాట్లాడారని ఆయన విమర్శించారు. క్షమాపణలు చెప్పేందుకు కూడా ఆయనకు మనసు రావడం లేదన్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో జిహాద్ మాఫియా నిధులు ఉన్నాయన్నారు. అనేక సినిమాల్లో హిందూ విశ్వాసాలను గాయపరిచేలా చిత్రీకరిస్తున్నారని అన్నారు. దీనిపై ఎన్ఐఏ దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.



