అంతర్జాతీయం
Trump: ఈయూపై త్వరలోనే అదనపు టారిఫ్‌లను విధిస్తాం.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్ ట్రంప్

Trump: అదనపు సుంకాల వడ్డనలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మిత్రులను కూడా వదలడం లేదు. ఐరోపా సమాఖ్యపై త్వరలోనే 25శాతం అదనపు టారిఫ్‌లను విధిస్తానన్నారు. అసలు ఈయూ ఏర్పడిందే అమెరికాను కట్టడి చేయడానికని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కాగా ట్రంప్ వ్యాఖ్యలు ఈయూలో కలకలం రేపాయి. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన ఈయూ అమెరికాకు వరమని పేర్కొంది యూరోపియన్ కమిషన్. స్వచ్ఛ, పారదర్శక వాణిజ్యానికి అన్యాయమైన అడ్డంకులపై ఈయూ తక్షణమే స్పందిస్తుందన్నారు. ఈ సుంకాలు చట్టాలను, వివక్ష రహిత విధానాలను సవాలు చేస్తాయని ఈయూ ప్రతినిధి తెలిపారు.