ఆంధ్ర ప్రదేశ్
Pawan Kalyan: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా కొందరు తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తున్నారని పవన్ పిటిషన్ వేశారు. పవన్ పిటిషన్ను స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు పవన్ వ్యక్తిగత హక్కుల ఉల్లంఘనపై వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా సంస్థలకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
అనంతరం తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. తమ ఫొటోలను ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ పలువురు సినీ ప్రముఖులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వీరిలో మెగస్టార్ చీరంజీవి, నాగార్జున, ఐశ్వర్యరాయ్, జూనియర్ ఎన్టీఆర్, తదితరులు ఉన్నారు.



