తెలంగాణ
హరీష్ రావుకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్

బీఆర్ఎస్ నేత హరీష్ రావుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు హరీష్ రావు వ్యవహార శైలి ఉందని విమర్శించారు. నీతులు ఎదుటి వారికి మాకు కాదు అన్నట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తిట్ల పురాణం, బూతులు ఒకసారి చూడాలని హరీష్ రావుకు సూచించారు.
ఉద్యమం సమయంలో నోటికి వచ్చిట్లు కేసీఆర్ మాట్లాడారు. రాజకీయాల్లో తిట్ల పురాణం మొదలుపెట్టిందే కేసీఆర్ అన్నారు. కేసీఆర్ రాజకీయంగా మాట్లాడితే రేవంత్ రెడ్డి రాజకీయాలు మాట్లాడతారన్నారు. కేసీఆర్ తిట్ల పురాణం మాట్లాడితే రేవంత్ రెడ్డి మీకంటే ఎక్కువ తిట్లు తిట్టగలరని కౌంటర్ ఇచ్చారు.



