ఆంధ్ర ప్రదేశ్
Kadiri: మెడికల్ షాపులో సెల్ ఫోన్ చోరీ చేసిన మైనర్ బాలుడు

Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి బస్టాండ్ సమీపంలోని మెడికల్ షాపులో ఓ మైనర్ బాలుడు పట్టపగలే చోరీకి పాల్పడ్డాడు. షాప్ యజమాని లోపల ఉండగానే గుర్తు తెలియని ఓ మైనర్ బాలుడు షాపు లోపలికి చేయిపెట్టి డెస్క్‌లో ఉన్న మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్ళిన దృష్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
విషయాన్ని వెంటనే కదిరి టౌన్ పోలీసులకు ఫార్మసీ యజమాని తెలియజేశారు. గత కొన్ని రోజులుగా కదిరిలో కొంతమంది మైనర్లు ఇలాంటి దొంగతనాలకు పాల్పడతుండడంతో పలు దుకాణాల యజమానులు ఆందోళనకు గురవుతున్నారు.



