ఆంధ్ర ప్రదేశ్
నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం

నేడు ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పాలనాపరమైన సంస్కరణలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకోనున్నారు. గత కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా, 3 కొత్త జిల్లాలు, పలు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం సుమారు 2 వేల 723 కోట్ల విలువైన పనులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. SIPB ప్రతిపాదించిన భారీ పరిశ్రమల స్థాపనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. కేబినెట్ భేటీ అనంతరం ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సీఎం మంత్రులతో ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది.



