తెలంగాణ
Kavitha: నా గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే.. నిరంజన్‌రెడ్డి పుచ్చలేసిపోతుంది

Kavitha: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డిపై జాగృతి అధ్యక్షురాలు కవిత హాట్ కామెంట్స్ చేశారు. వనపర్తిలో నిరంజన్‌రెడ్డి అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీసీ యువకులపై కేసు పెట్టించాడని కవిత మండిపడ్డారు. కృష్ణా నదిని కబ్జా చేసి ఫామ్‌హౌస్ కట్టుకుంటున్నారని అన్నారు.
దీనిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. నా గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే నిరంజన్‌రెడ్డి పుచ్చలేసిపోతుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తండ్రి వయసువారని ఇప్పటికీ గౌరవిస్తున్నా ఎక్కువ మాట్లాడితే ఊరుకోనని ఎమ్మెల్సీ కవిత అన్నారు.



