తెలంగాణ
Kishan Reddy: రేవంత్ సర్కార్ ప్రభుత్వ స్కూళ్లను నిర్లక్ష్యం చేస్తోంది

Kishan Reddy: రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వ పాఠశాలల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వాలు మారినా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మారడం లేదని కేంద్రమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ హాస్టల్స్‌లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు.
మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ అంటున్న కాంగ్రెస్ సర్కార్ వాడుకలో ఉన్న స్కూళ్లకు మరమ్మత్తులు కూడా చేయడం లేదని, విద్యుత్తు, మంచి నీటి సౌకర్యం కల్పించడం లేదని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ సందర్భంగా కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.



