సినిమా

Akhanda 2: ‘జాజికాయ’తో మాస్ జోష్ అందిస్తున్న అఖండ-2!

Akhanda 2: బాలకృష్ణ ‘అఖండ-2 తాండవం’ నుంచి జాజికాయ లిరికల్ సాంగ్ విడుదలైంది. మాస్ బీట్‌తో వచ్చిన ఈ పాట ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా మారింది. డిసెంబర్ 5న సినిమా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

నందమూరి బాలకృష్ణ గాడ్ ఆఫ్ మాసెస్ ఇమేజ్‌ను మరింత ఎలివేట్ చేయబోతున్న అఖండ-2 తాండవం సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి జాజికాయ జాజికాయ లిరికల్ సాంగ్ విడుదలైంది. బ్రిజేష్ శాండిల్య, శ్రేయా ఘోషల్ ఆలపించగా, కాసర్ల శ్యామ్ సూపర్ లిరిక్స్ అందించారు.

బాలకృష్ణ మాస్ డాన్స్ స్టెప్స్, సంయుక్త మీనన్ అందాలు హైలైట్‌గా నిలిచాయి. ఈ పాట ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్ అవుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 5న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button