ఆంధ్ర ప్రదేశ్
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతోంది. రేపటి వరకు అల్ప పీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. వర్షాలపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష జరిపారు. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.



