తెలంగాణ
Bibinagar: గుడి దగ్గర పసికందును వదిలేసి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు

అప్పుడే పుట్టిన పసికందును ఆలయ పరిసరాల్లో వదిలేసి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ అమానవీయ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం పడమటి సోమారంలో చోటు చేసుకుంది. శ్రీ లింగ బసవేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు పసికందును వదిలేసి వెళ్లారు.
ఆ తర్వాత కాసేపటికి పాప ఏడుపులతో చిన్నారిని గమనించిన స్థానికులు ఆలయ పూజారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం పాపను భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అసలు పాపను ఎవరు వదిలి వెళ్లారు, ఎందుకు వదిలేసి వెళ్లారనే వివరాలు తెలియాల్సి ఉంది.



