UAE: ఆ వ్యక్తికి నలుగురు భార్యలు.. 100 మంది పిల్లలు..

UAE: వ్యాసుడు మనవాళికి అందించిన మహా అమృత భాండం మహాభారతం. ఈ మహాత్తర ఘట్టంలో దృతరాష్ట్ర, గాంధారిల సంతానం గురించి అందరికీ తెలుసు. ఈ దంపతులకు వంద మంది పిల్లలు ఉన్నారు. ఆ విషయం గురించి మనం చిన్నప్పుడే చందువుకున్నాం పురాణాల్లో, పుస్తకాల్లో విన్నాం. కానీ అలాంటి వ్యక్తి నిజంగా ఉన్నాడట. ఓ వ్యక్తి తనకు కూడా వంద మంది పిల్లలు ఉన్నారని చెబుతున్నాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి? ఏ దేశానికి చెందిన వాడు? నిజంగా అతనికి 100మంది పిల్లలు ఉన్నారా..?
పూర్వం ఒక్కొక్కరూ చాలా పెళ్లిళ్లు చేసుకునేవారు. గంపెడు మంది పిల్లల్ని కనేవారు. అయితే మారుతున్న జీవన విధానంలో చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం ఒకరు ఒకే పెళ్లి చేసుకుంటున్నారు. చిన్న కుటుంబం చింతలేని కుటుంబమంటూ ముందుకు సాగుతున్నారు. ఎక్కువ సభ్యులు ఉన్న కుటుంబంలో ఆర్థిక సమస్యలు కుటుంబ భారం ఎక్కువగా ఉంటుందని అలాగే మానసిక ఒత్తిడి ఉంటుందని చెబుతుంటారు. అందుకు తల్లిదండ్రులు వారికి ఇద్దరు పిల్లలు ఇలా చిన్న కుటుంబం ఉండడం వలన సంతోషంగా గడిపేస్తారని అంటుంటారు.
ఇక మన భారత దేశంలో ఉమ్మడి కుటుంబాల గురించి తెలిసిందే. పూర్వం రోజుల్లో చాలా వరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి క్రమంగా మారుతున్న కాలానుగుణంగా ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయాయి. ఒకే చోట ఉండకుండా వృత్తి, ఉద్యోగాల రీత్యా ఎవరి దారి వాళ్లు చూసుకుంటున్నారు. కానీ కొన్ని మతాల్లో ఒకరి కంటే ఎక్కువమందిని పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఉంది. ఇలాంటి సందర్భంలో ఓ వ్యక్తి కుటుంబం గురించి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు.
సయీద్ ముస్బా అల్ కెట్బీ ఇతను యూఏఈ పరిశోధకుడు. ఈయనకు 4 పెళ్లిల్లు, 100మంది పిల్లలు ఉన్నారట. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. ఇది సాంస్క్కతిక వారసత్వంపై పరిశోధన చేసే యూఏఈ సంస్థ. ఇంతను తనకు నలుగురు భార్యలు ఉన్నారని 100 మందికి పైగా పిల్లలు కూడా చెప్పాడు. ఈ వార్త విన్న ప్రేక్షకులు ఒక్కసారిగా నివ్వేరపోయారు. గల్ఫ్ న్యూస్ ప్రకారం వార్షిక ఫోరమ్ షార్జా ఇన్స్టిట్యూట్ ఫర్ హెరిటేజ్ అనే కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి సాంస్కృతిక వారసత్వంపై పరిశోధన చేసే యూఏఈ పరిశోధకుడు సయీద్ ముస్బా అల్ కెట్బీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చెసిన వ్యాఖ్యలను ప్రేక్షకులను నివ్వేరపోయేలా చేసింది. తనకు నలుగురు భర్యలు ఉన్నారని 100 మందికి పైగా పిల్లలు ఉన్నారని ఆయన వెల్లడించారు. తన పూర్వీకుల సంప్రదాయాలను కొనసాగిస్తూనే తన సాంస్కృతిక విలువలను కాపాడుకుంటున్నానని చెప్పాడు. ఈ విషయం అందరినీ షాక్‌కు గురి చేసింది.
కాగా షార్జా ఇన్స్టిట్యూట్ ఫర్ హెరిటేజ్ అనేది షార్జాలో ఉన్న ఒక సాంస్కృతిక, శాస్త్రీయ, విద్యా సంస్థ. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAEకి చెందిన అమూల్యమైన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, కాపాడటం, నమోదు చేయడం, విస్తరించడం. సెమినార్లు, ఉపన్యాసాలు, ఫోరమ్‌ల ద్వారా తమ విలువలను కాపాడుకునేందుకు యత్నిస్తోంది. అందులో భాగంగా ఏర్పాటు చేసిన సెమినార్లో ముస్బా అల్ కెట్బీ తన వ్యక్తిగత జీవితం గురించి వివరించారు.
తన ప్రసంగంలో అతను తన వ్యక్తిగత జీవితం గురించి వివరాలను వెల్లడించారు. తన పిల్లలలో ఎమిరాటీ విలువలు, మర్యాదలు నియమావళి అయిన అల్ సనాను పెంపొందించడంపై దృష్టి సారించానని అల్ కెట్బీ అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యింది. లక్షల సంఖ్యలో జనాలు ఈ వీడియోను వీక్షించారు.
అయితే మహాభారత పురాణం ప్రకారం ధృతరాష్ట్రునికి 100 మంది కుమారులు, ఒక కుమార్తె, దుశ్శల, జన్మించారు. వీరిలో అత్యంత ప్రసిద్ధుడు దుర్యోధనుడు, అతను ధృతరాష్ట్రుని పెద్ద కుమారుడు. వీరితో పాటు, ధృతరాష్ట్రునికి సుఘద అనే దాసి ద్వారా యుయుత్సుడు అనే మరో కుమారుడు కూడా ఉన్నాడు. వ్యాస మహర్షి ఆశీర్వాదంతో, గాంధారికి ఒకేసారి 100 మంది పిల్లలకు జన్మనిచ్చే శక్తి లభించింది.
గాంధారి గర్భం దాల్చిన తర్వాత, రెండేళ్లపాటు ప్రసవించలేదు, అప్పుడు వ్యాసుడు ఆ మాంసాన్ని 101 ముక్కలుగా చేసి, 100 మంది కుమారులకు, ఒక కుమార్తెకు ఒక్కొక్క పాత్రలలో ఉంచమని చెప్పాడు. ఆ తర్వాత 101మంది పిల్లలు జన్మించారు. అందులో ధృతరాష్ట్రుని పెద్ద కుమారుడు దుర్యోధనుడు. యుయుత్సుడు ధృతరాష్ట్రుని ఏకైక కుమారుడు, కౌరవులతో కలసి యుద్ధం చేయలేదు. అతను గాంధారి నుండి కాకుండా, ఆమె పనిమనిషి అయిన సుఘద నుండి జన్మించాడు
అయితే ఇతనే కాదు ఇలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు. మిజోరాంలోని బాట్వాంగ్ గ్రామంలో ఓ కుటుంబం దాదాపు 100 గదులతో కూడిన ఇంట్లో నివసిస్తోంది. ఆ కుటుంబం పెద్ద జియోనా చనా. అతడి వయసు 76 సంవత్సరాలు. అతడికి 39 మంది భార్యలు 94 మంది పిల్లలు 14 మంది కుమార్తెలు 33 మంది మనవరాళ్లు ఒక మనవడు ఉన్నారు. జియోనా వృత్తి రీత్యా వడ్రంగి. ఇదిలా ఉంటే ఈ కుటుంబంలోని వ్యక్తులందరూ ఒకరిపై ఒకరు ఆధారపడరు. ఎవరి అవసరాలకు వారే పనులు చేసుకుంటారు. జియోనాకు పెద్ద మొత్తంలో సాగు భూమి ఉంది. ఇక్కడ జియోనా కుటుంబ సభ్యులు ఆహార ధాన్యాలు కూరగాయలు, పండ్లను పండిస్తారు.
ఇవే కాకుండా కోడి గుడ్ల వినియోగం చేసేందుకు సొంతంగా ఫౌల్ట్రీఫాం ను కూడా నిర్వహిస్తున్నారు. వీరి కుటుంబంలో మొత్తం 181 మంది సభ్యులు ఉన్నారు. కానీ కుటుంబ పోషన, ఆహారం విషయంలో ఎలాంటి ఇబ్బంది పడరు. ఇక వారందరూ కూడా జియోనా ఆదేశాలను కచ్చితంగా పాటిస్తారు. ఇప్పటికీ ఆ కుటుంబం మొత్తం పూర్తి క్రమశిక్షణతో ఉంటారు. వీరందరూ వ్యవసాయం ఇతర పనులు చేస్తుంటారు. ఇక జియోనా పెద్ద భార్య ఆ కుటుంబం మొత్తానికి అధిపతిగా వ్యవహరిస్తుంది. తన కుటుంబంలో అనేక రకాల తెగలకు చెందిన సభ్యులున్నారని తన తండ్రి పేద, అనాథ మహిళలను వివాహం చేసుకున్నాడని పార్లియానా చెప్పారు.
ఆఫ్రికా దేశమైన టాంజానియాలోని ఒక చిన్న గ్రామంలో నివసించే కపింగా అనే వ్యక్తి వరుస పెళ్లిళ్లతోనే వరల్డ్ ఫేమస్ అయిపోయాడు. ఈ ఆఫ్రికన్ వ్యక్తి సుమారు 20 పెళ్లిళ్లు చేసుకోగా కొన్ని కారణాలతో నలుగురు భార్యల్లో కొందరు చనిపోగా, కొందరు విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం 16 మంది భార్యలు, 104 మంది పిల్లలు ఉన్నారు. అలాగే 144 మంది మనవళ్లు, మనవరాళ్ళు కూడా ఉన్నారు.
అంతా ఒకేచోట ఆనందంగా కలిసి మెలిసి జీవిస్తున్నారు. చెప్పాలంటే అతడి ఇల్లే ఓ గ్రామంలా మారిపోయింది. వాళ్లింట్లో వంటలు చేస్తే ఏదో వేడుక జరుగుతుందేమో అన్నట్లు ఉంటుంది. ఎందుకంటే అంతమందికి భారీస్థాయిలో వంటలు చేయాల్సి ఉంటుంది. అయితే అంతా కలసే వండుకుని ఒకే చోట కూర్చొని తింటారట. మొత్తం కుటుంబం అంతా వ్యవసాయంపై ఆధారపి జీవిస్తుందట. అందరూ పంటలు పండిస్తూ, పశువులును మెపుతూ తమ ఆహార అవసరాలను తీర్చుకుంటారట.
యూఏఈ ప్రజలు కెట్బీ ఆరోగ్యం, వారసత్వం పెంపుపై అతని నిబద్ధతను ప్రశంసిస్తూ చాలా మంది కామెంట్లు చేశారు. కానీ ఈ వార్త విన్న భారతీయులు మాత్ర విమర్శలు కురిపిస్తున్నారు. నువ్వు మనిషివా మానవ మృగానివా అంటూ ఫైర్ అవుతున్నారు. ముస్లింలకు ఇది అలవాటేనని స్థితిగతులు, పరిస్థితులు, ఆర్థిక స్ధితి కూడా చూడకుండా పిల్లలను కంటుంటారని మండిపడుతున్నారు. పైగా అందరికీ చెప్పాల్సిన మనిషి ఓ పరిశోధకుడు ఇలా చెప్పడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇదేం సంప్రదాయమంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.



