ఆంధ్ర ప్రదేశ్

Kakinada: ఉప్పాడ తీరంలో రాకాసి అలలు .. ధ్వంసమైన బీచ్‌ రోడ్డు

కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంతంలో రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఈ కారణంగా ఉప్పాడ- కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసమైంది . బీచ్ రోడ్‌లో రాకపోకలు నిలిపివేశారు. ఎగసిపడుతున్న రాకాసి అలలతో కొత్తపట్నం గ్రామంలోకి సముద్రపు నీరు చేరడంతో గ్రామం ముంపు గురైంది . విషయం తెలుసుకున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఉప్పాడ తీర ప్రాంతంలో పర్యటించారు.

వర్మ పరిశీలిస్తున్న సమయంలో రాకాసి అలలు ఉవ్వెత్తిన ఎగసిపడ్డాయి. ఆ సమయంలో వర్మ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కొత్తపట్టణం లో పర్యటించిన వర్మ మత్స్యకారులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అధికారులు చర్యలు చేపడతారని మత్స్యకారులు ఎవరు అధైర్య పడద్దని అన్ని విధాలుగా అండగా ఉంటానని వర్మ హామీ ఇచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button