తెలంగాణ

గురుకుల సిబ్బంది నిర్లక్ష్యం.. విద్యార్థిని మృతి

గురుకుల సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ విద్యార్థిని మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. గురుకుల సిబ్బంది చేయాల్సిన పనిని విద్యార్థులతో చేయించడంతో ఆటో నుంచి ప్రమాదవశాత్తు కిందపడి సంగీత అనే విద్యార్థిని మరణించింది. బాన్సువాడ మండలం బోర్లం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.

బెంచీలు, కూర్చిలు ఆటో నుంచి దింపుతుండగా.. ఒక్కసారిగా విద్యార్థిని కింద పడిపోయింది. దీంతో తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇక విద్యార్థిని మృతితో పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు కుటుంబసభ్యులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button