తెలంగాణ
వికారాబాద్ జిల్లా పరిగిలో యూరియా కోసం రైతుల ఆందోళన

వికారాబాద్ జిల్లా పరిగిలో యూరియా కోసం ఫర్టిలైజర్ షాప్ వద్ద రైతులు, బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి రోడ్డుపై భైఠాయించి ధర్నా చేపట్టారు. యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కొప్పుల మహేష్‌రెడ్డి అన్నారు. రైతులు రెండు నెలల నుండి యూరియా కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. గత పదేళ్లలో రైతులకు యూరియా కొరత ఎదురుకాలేదని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి అన్నారు.



