తెలంగాణ
Chevella: చేవెళ్ల ప్రమాదం.. ముగ్గురు అక్కా చెల్లెళ్ల మృతి

Chevella: రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో విషాదాన్ని నింపింది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం గాంధీనగర్‌కు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కుమార్తెలు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిని తనూష, సాయి ప్రియ, నందినిగా గుర్తించారు.
కొద్ది రోజుల క్రితం కుటుంబంలో జరిగిన పెళ్లి వేడుకలో ఆనందంగా గడిపిన ఈ ముగ్గురూ, ఇప్పుడు మృతదేహాలుగా మారడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఒక్కసారిగా సంబరాలు కన్నీళ్లుగా మారిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది.



