Kavitha: ఉద్ధండాపూర్ ప్రాజెక్ట్‌ను పరిశీలించిన కవిత

Kavitha: రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్దండాపూర్ ప్రాజెక్ట్ పనులు ఆగిపోయాయని కవిత విమర్శించారు. 80 శాతం పూర్తయిన ఉదండాపూర్ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తారో లేదో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా జడ్చర్ల మండల పరిధిలోని ఉద్ధండాపూర్ ప్రాజెక్టును కవిత పరిశీలించారు. బాధిత రైతులకు పరిహారం చెల్లింపుల్లో అన్ని పార్టీలు విఫలమయ్యాయని మానవతా దృక్పథంతో భూ నిర్వాసితుల ప్యాకేజీ పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని సూచించారు.
ఉద్దండాపూర్ పనులు ఆపేసి నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టులను ప్రారంభించారని కవిత విమర్శించారు. భూ నిర్వాసితుల చిన్నచిన్న సమస్యలు కూడా పరిష్కరించడంలో ప్రభుత్వం వెనుకాడడం సరైన పద్ధతి కాదన్నారు. ఆర్‌అండ్ఆర్ ప్యాకేజ్ అందించే సమయంలో ఉన్న భూముల ధరల ఆధారంగా చెల్లింపులు ఉండాలని కవిత డిమాండ్ చేశారు.



