తెలంగాణ
సింగరేణి కార్మికులకు దసరా బోనస్

సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించింది ప్రభుత్వం. సింగరేణి లాభాల్లో 34 శాతాన్ని కార్మికులకు పంచాలని నిర్ణయించారు. ఒక్కో కార్మికుడికి బోనస్‌గా లక్షా 95 వేల 610 రూపాయలు పంపిణీ చేయనున్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు 5 వేల 500 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.



